బుధవారం 03 జూన్ 2020
Telangana - May 13, 2020 , 14:46:30

మాస్క్ పెట్టుకో లేదో జేబు ఖాళీ..

మాస్క్ పెట్టుకో లేదో జేబు ఖాళీ..

మంచిర్యాల : కరోనా కట్టడి కోసం ప్రతి ఒక్కరూ నిబంధనలు పాటించి మాస్క్‌లు ధరించాలని చెప్పినా కొంత పెడ చెవినా పెడుతున్నారు. తాజాగా మంచిర్యాల పట్టణంలో పోలీసులు, మున్సిపల్ అధికారులు  సంయుక్తంగా వ్యాపార కూడలిలో సముదాయాలు, బహిరంగ ప్రదేశాల్లో తనిఖీలు నిర్వహించారు. నిబంధనలు పాటించని వారిపై కొరడా ఝులిపించారు. మాస్కులు  పెట్టుకోకుండా ఉన్నవ్యాపారస్తులు, వ్యాపార సంస్థలలో పని చేసే ఉద్యోగులు మొత్తం 23 మందిపై  ఈ -పెట్టి కేసులు  నమోదు చేశారు. అలాగే కామారెడ్డి జిల్లా బోధన్ పట్టణంలో వాహనాలు తనిఖీలు చేసి మాస్క్ లు ధరించని వారికి పోలీసులు జరిమానా విధించారు.logo