గురువారం 04 జూన్ 2020
Telangana - Feb 28, 2020 , 02:16:55

బీసీ ఫెడరేషన్లతో ఉపాధి కల్పన

బీసీ ఫెడరేషన్లతో ఉపాధి కల్పన
  • నిరుద్యోగ యువతకు ప్రత్యేక శిక్షణ
  • అధికారులకు మంత్రి గంగుల ఆదేశం

హైదరాబాద్‌, నమస్తే తెలంగాణ: బీసీల ఆర్థిక, సామాజిక ప్రగతి లక్ష్యంగా 11 ఫెడరేషన్ల ద్వారా ఆయా వృత్తులవారికి ఉపాధి కల్పించాలని బీసీ సంక్షేమశాఖ మంత్రి గంగుల సూచించారు. సంక్షేమహాస్టళ్లలో వసతులు మె రుగుపర్చాలని ఆదేశించారు. గురువారం హైదరాబాద్‌లోని సంక్షేమభవన్‌ లో జిల్లాల అధికారులతో నిర్వహించిన సమీక్షలో మంత్రి మాట్లాడారు. పదివేలమంది బీసీ మహిళలకు శిక్షణ ఇప్పించి కుట్టుమిషన్లు అం దించాలన్నారు. యువతులకు నిఫ్ట్‌ద్వారా శిక్షణ ఇప్పించి ఉపా ధి కల్పించాలని కోరారు. ఐదుగురు నిరుద్యోగులు ఒక యూని ట్‌గా ప్రతిజిల్లాకు ‘ఆపద్బంధు’ పేరిట అంబులెన్సులను బీసీ కార్పొరేషన్‌ ద్వారా అందించేందుకు సీఎం కేసీఆర్‌ అనుమతి కోరనున్నట్టు చెప్పారు. రెగ్యులర్‌ సంక్షేమాధికారులను నియమించేందుకు తీసుకోవాల్సినచర్యలపై మంత్రి సమీక్షించారు.


logo