శనివారం 24 అక్టోబర్ 2020
Telangana - Sep 22, 2020 , 13:07:12

పరిశ్రమల ఏర్పాటుతో యువతకు ఉపాధి

పరిశ్రమల ఏర్పాటుతో యువతకు ఉపాధి

యాదాద్రి భువనగిరి : పరిశ్రమల ఏర్పాటుతో యువతకు ఉద్యోగ, ఉపాధి అవకాశాలు మెరుగు పడతాయని ప్రభుత్వ విప్, ఆలేరు ఎమ్మెల్యే  గొంగిడి సునీత మహేందదర్ రెడ్డి అన్నారు. ఇండస్ట్రియల్ ఏర్పాటుకు మంగళవారం తుర్కపల్లి మండల కేంద్రంలోని 72 సర్వే నెంబర్ లో గల స్థలాన్ని కలెక్టర్ అనితారామచంద్రన్ తొ కలిసి పరిశీలించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. రెవెన్యూ అధికారులు త్వరితగతిన స్థలాన్ని సేకరించి పూర్తి నివేదిక అందించాలన్నారు. గ్రామాల్లోని ఆసక్తిగల యువత చిన్న తరహా పరిశ్రమల ఏర్పాటుకు ముందుకు రావాలన్నారు. కార్యక్రమంలో ఆర్డీవో భూపాల్ రెడ్డి, ఎంపీపీ సుశీల, పీఏసీఎస్ చైర్మన్ నర్సింహారెడ్డి తదితరులు పాల్గొన్నారు.


logo