శనివారం 06 జూన్ 2020
Telangana - May 01, 2020 , 10:20:46

ఉపాధి హామీ పనులను వ్యవసాయానికి అనుసంధానం చేయాలి

ఉపాధి హామీ పనులను వ్యవసాయానికి అనుసంధానం చేయాలి

జనగామ: లింగాలఘన్‌పూర్‌ మండలం కుందారం గ్రామంలో ఉపాధి హామీ కూలీలతో మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు మాట్లాడారు. పనులకు వెళుతున్న ఉపాధి హామీ కూలీలతో వారు చేస్తున్న పనులు, దొరుకుతున్న ఉపాధి, కరోనా పరిస్థితులపై అడిగి తెలుసుకున్నారు. 

కరోనా కట్టడికి భౌతిక దూరం పాటించడం ఒక్కటే మార్గమని కూలీలకు వివరించారు. ఉపాధి హామీ కూలీలు పెరుగుదలను గూరించి తెలిపారు. ఉపాధి కూలీలకు వ్యవసాయ పనులకు అనుసంధానం చేయాలని చేయాలని సీఎం కేసీఆర్‌, తాను కేంద్ర ప్రభుత్వానికి చెప్పినట్లు వెల్లడించారు. కష్టకాలంలో కరువు పనులు ఎంతో మేలు చేస్తాయని చెప్పారు. కూలీలు తప్పనిసరిగా మాస్కులు ధరించాలని సూచించారు. అనంతరం పాలకూర్తిలో ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని మంత్రి పరిశీలించారు. logo