బుధవారం 02 డిసెంబర్ 2020
Telangana - Nov 13, 2020 , 02:40:40

కల్లం వచ్చే.. కష్టం తీర్చె

కల్లం వచ్చే.. కష్టం తీర్చె

ఉపాధి హామీ పథకం కింద రాష్ట్ర ప్రభుత్వం నిర్మిస్తున్న కల్లాల ద్వారా అన్నదాతల కష్టాలు తీరుతున్నాయి. మంచిర్యాల జిల్లా చెన్నూర్‌ మండలం ఆస్నాద్‌ గ్రామంలో రూ.85 వేలతో ఏర్పాటు చేసిన కల్లంలో గురువారం రైతు ముత్యాల బాపాగౌడ్‌ ధాన్యం ఆరబోశారు. ఇన్నాళ్లూ పొలాల్లో ధాన్యం ఆరబోస్తే వర్షానికి తడిసి ముద్దయ్యేదనీ, రాష్ట్ర ప్రభుత్వం నిర్మించిన కల్లాలతో ప్రస్తుతం ఆ సమస్య తీరిందని హర్షం వ్యక్తంచేస్తున్నారు. - చెన్నూర్‌ రూరల్‌