శనివారం 28 నవంబర్ 2020
Telangana - Nov 11, 2020 , 12:18:59

చేపపిల్లల పెంపకంతో మత్స్యకారులకు ఉపాధి : మంత్రి నిరంజన్‌ రెడ్డి

చేపపిల్లల పెంపకంతో మత్స్యకారులకు ఉపాధి : మంత్రి నిరంజన్‌ రెడ్డి

వనపర్తి : మత్య్స కార్మికుల ఉపాధి కోసం చెరువుల్లో ఉచిత చేప పిల్లలు వదులుతున్నామని వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి అన్నారు. పెబ్బేరు మండలం గుమ్మడంలో శ్రీశైలం బ్యాక్ వాటర్‌లో ఉచిత చేప పిల్లలను వదిలారు. అంతకుముందు పెబ్బేరులో ధాన్యం కొనుగోలు కేంద్రం, వెంకటాపురంలో మినీ గోదాంను ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ..పెరుగుతున్న జల సంపదకు తోడుగా మత్య్ససంపద కూడా పెరుగుతుందన్నారు.

జిల్లాలో 2.50 కోట్ల చేప పిల్లల వేయాలని లక్ష్యంగా పెట్టుకున్నాం. ఇప్పటి వరకు 2.20 కోట్ల చేప పిల్లలు వేశామన్నారు. శ్రీశైలం బ్యాక్ వాటర్ పరిధి వనపర్తి నియోజకవర్గంలోని 11 గ్రామాలు ఉన్నాయి. ఇక్కడ మొత్తం 26 లక్షల చేప పిల్లలు వేశామన్నారు. విరివిగా చేపలు లభించడంతో అన్ని వర్గాల ప్రజలకు బలవర్ధకమైన ఆహారం లభిస్తుందన్నారు. గ్రామాల్లో  వ్యవసాయం స్థిరపడి, చేతివృత్తులు బలపడుతున్నాయి. గ్రామీణ ఆర్థిక వ్యవస్థ బలోమేతమవుతుందన్నారు. ప్రభుత్వ పటిష్ట చర్యలతో గ్రామాల్లో స్పష్టమయిన మార్పు కనిపిస్తున్నదని మంత్రి తెలిపారు.