సోషల్‌మీడియాలో చురుకుగా ఎంటూ ఏదో ఒక అప్డేట్ తో అందరినీ పలుకరిస్తుంటుంది రకుల్‌ప్రీత్‌సింగ్ . ఫిట్నెస్ మంత్రను ఫాలో అవుతూ..అందరికీ పాఠాలు చెప్పే ఈ ముద్దుగుమ్మ ఇపుడు మరో నినాదంతో నెటిజన్లు, ఫాలోవర్ల ముందుకొచ్చింది. తెలుపు చొక్కా, డెనిమ్ షార్ట్స్‌లో ఉన్న ప్రీత్‌సింగ్ పడవపై కూర్చొని స్టైలిష్ గాగుల్స్, వాచ్ పెట్టుకుని హాయిగా నవ్వుతున్న స్టిల్‌ను ఇన్ స్టాగ్రామ్‌లో పోస్ట్ చేసింది. రకుల్ ప్రీత్ సింగ్ పోస్ట్ చేసిన స్టిల్ అందరిలో పాజిటివ్ వైబ్రేషన్ ను అందిస్తూ..వైరల్‌గా మారింది.
మీరు జీవించినంత కాలం శ్వాస తీసుకున్నంత వరకు నవ్వండి..అనే నినాదాన్ని క్యాప్షన్ గా ఇచ్చింది. రకుల్ ప్రీత్ సింగ్ ప్రస్తుతం హిందీలో అర్జున్ కపూర్‌తో కలిసి సర్దార్ కా గ్రాండ్సన్, ఆయుష్మాన్ ఖురానాతో డాక్టర్ జీ చిత్రాల్లో నటిస్తోంది. అజయ్‌దేవ్‌గన్, అమితాబ్ బచ్చన్ తో మేడే సినిమాతోపాటు తెలుగులో క్రిష్ డైరెక్షన్లో వైష్ణవ్‌తేజ్ హీరోగా వస్తున్న చిత్రంలో హీరోయిన్ గా నటిస్తోంది.