శనివారం 27 ఫిబ్రవరి 2021
Telangana - Jan 16, 2021 , 19:45:04

పదోన్నతుల ప్రక్రియ వేగంగా పూర్తిచేయాలి : సీఎస్‌

పదోన్నతుల ప్రక్రియ వేగంగా పూర్తిచేయాలి : సీఎస్‌

హైదరాబాద్‌ : సచివాలయ స్థాయి నుంచి జిల్లాస్థాయి వరకు అన్నివిభాగాల ఉద్యోగుల పదోన్నతుల ప్రక్రియ వేగంగా పూర్తిచేయాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్ అధికారులను ఆదేశించారు. సీఎం కేసీఆర్‌ ఆదేశాల మేరకు సీఎస్‌ శనివారం ప్రత్యేక  ప్రధానకార్యదర్శులు, ముఖ్య కార్యదర్శులు, కార్యదర్శులతో వివిధశాఖల్లో పదోన్నతుల ప్రక్రియపై సమీక్షించారు. పదోన్నతుల ప్రక్రియను ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకున్నందున సాంకేతిక సమస్యలను పరిష్కరించి మార్గదర్శకాల ప్రకారం డీపీసీలను నిర్వహించాలని ఆదేశించారు.

సమావేశంలో మున్సిపల్‌శాఖ ముఖ్యకార్యదర్శి  అర్వింద్ కుమార్, ఆర్థికశాఖ ముఖ్య కార్యదర్శి కే రామకృష్ణారావు, జీఏడీ ముఖ్యకార్యదర్శి వికాస్ రాజ్, ఐటీశాఖ ముఖ్య కార్యదర్శి జయేశ్‌ రంజన్, రహదారులు, భవనాలశాఖ  ముఖ్యకార్యదర్శి  సునీల్‌శర్మ, యువజన సర్వీసుల ముఖ్య కార్యదర్శి సబ్యసాచి ఘోశ్‌, ఆర్థికశాఖ కార్యదర్శి రోనాల్డ్ రోస్, ఆర్థికశాఖ సీనియర్ కన్సల్టెంట్ శివశంకర్, ఉన్నతాధికారులు పాల్గొన్నారు.

లోకల్ టు గ్లోబల్.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్లో నమస్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.

VIDEOS

logo