శుక్రవారం 30 అక్టోబర్ 2020
Telangana - Oct 05, 2020 , 16:49:04

కేంద్రం విద్యుత్‌ చట్టాన్ని వ్యతిరేకిస్తూ ఉద్యోగుల ధర్నా

కేంద్రం విద్యుత్‌ చట్టాన్ని వ్యతిరేకిస్తూ ఉద్యోగుల ధర్నా

హైదరాబాద్‌ : కేంద్ర ప్రభుత్వం తేనున్న విద్యుత్‌ చట్టానికి వ్యతిరేకంగా విద్యుత్‌ సౌధలో విద్యుత్‌ జేఏసీ ఉద్యోగులు ధర్నా నిర్వహించారు. నూతన విద్యుత్‌ చట్టాన్ని అమలు చేయొద్దని జేఏసీ ఉద్యోగులు డిమాండ్‌ చేశారు. కేంద్ర ప్రభుత్వం తీసుకురాబోయే చట్టంతో కార్పొరేట్లకే ఉపయోగపడుతుందని ఆరోపించారు. ఎంతో చరిత్ర ఉన్న విద్యుత్‌ సంస్థను ప్రైవేటు పరం చేసేందుకు కేంద్రం కొత్త విద్యుత్‌ చట్టం తెస్తుందని విద్యుత్‌ ఉద్యోగుల జేఏసీ విమర్శించింది. చట్టంతో తెలంగాణతో ప్రజలకు, రాష్ట్రంలోని ఇరిగేషన్‌ ప్రాజెక్టులకు తీవ్ర నష్టం జరుగుతుందన్నారు. సీఎం కేసీఆర్‌ చట్టాన్ని మొదటి నుంచి వ్యతిరేకిస్తున్నారని, ప్రజల సంక్షేమం కోసం బిల్లుకు వ్యతిరేకంగా అసెంబ్లీలో తీర్మానం చేశారన్నారు. చట్టాన్ని కేంద్రం వెనక్కి తీసుకోవాలని ఈ సందర్భంగా జేఏసీ డిమాండ్‌ చేసింది. కేంద్రం చట్టాన్ని ఉపసంహరించుకునే వరకు ఉద్యమం కొనసాగిస్తామని స్పష్టం చేశారు. చట్టాన్ని ఎట్టి పరిస్థితుల్లో స్వాగతించమని చెప్పారు. 


లోకల్ టు గ్లోబల్.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్లో. నమస్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.