సోమవారం 30 మార్చి 2020
Telangana - Mar 08, 2020 , 14:47:26

ఆర్టీసీకి రూ. 1,000 కోట్లు.. ఉద్యోగులకు ఎంప్లాయిస్‌ బోర్డు

ఆర్టీసీకి రూ. 1,000 కోట్లు.. ఉద్యోగులకు ఎంప్లాయిస్‌ బోర్డు

హైదరాబాద్‌ : ఆర్టీసీ ఇప్పుడిప్పుడే లాభాల బాటలోకి వస్తుందని మంత్రి హరీష్‌రావు స్పష్టం చేశారు. ఆర్టీసీ ఉద్యోగుల సమస్యలను ఎప్పటికప్పుడు పరిష్కరించడానికి ఎంప్లాయిస్‌ బోర్డును ప్రభుత్వం ఏర్పాటు చేస్తుందని మంత్రి తెలిపారు. ఆర్టీసీ ఉద్యోగుల పదవీ విరమణ వయస్సును ప్రభుత్వం 60 ఏళ్లకు పెంచిందని గుర్తు చేశారు మంత్రి. కార్గో, పార్సిల్‌ సర్వీసులను సైతం ఆర్టీసీ ప్రారంభించిందని తెలిపారు. ఈ బడ్జెట్‌లో ఆర్టీసీకి రూ. 1,000 కోట్లు ప్రతిపాదించినట్లు హరీష్‌రావు పేర్కొన్నారు. 


logo