ఆదివారం 29 మార్చి 2020
Telangana - Mar 04, 2020 , 15:59:52

కరోనా కలవరం..మైండ్‌స్పేస్‌ ఉద్యోగులు ఇంటికి

కరోనా కలవరం..మైండ్‌స్పేస్‌ ఉద్యోగులు ఇంటికి

హైదరాబాద్‌: మాదాపూర్‌ ఐటీ కారిడార్‌లోని డీఎస్‌ఎం కంపెనీలో ఓ ఉద్యోగికి కరోనా సోకినట్లు తెలిసింది. వైరస్‌ వ్యాప్తిని అరికట్టేందుకు  ముందు జాగ్రత్త చర్యగా ఉద్యోగులను ఇంటికి పంపించిన యాజమాన్యాలు వర్క్‌ ఫ్రమ్‌ హోకు ఆదేశించాయి. రహేజా ఐటీ పార్క్‌లో ఉద్యోగులను ముందు జాగ్రత్తగా ఇంటికి పంపిస్తున్నారు. హైదరాబాద్‌లో కరోనా అనుమానితుల సంఖ్య పెరుగుతుండటంతో..  అత్యవసరమైతే తప్ప ఉద్యోగులు ప్రయాణాలు చేయకూడదని సూచించాయి.  కరోనా వైరస్‌ వ్యాప్తిని నిరోధించేందుకు రాష్ట్ర ప్రభుత్వం అన్ని చర్యలు చేపట్టింది. భారత్‌లో ఇప్పటికే 28 కేసులు నమోదైనట్లు కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి ప్రకటించిన విషయం తెలిసిందే. ఇవికూడా చదవండి


కరోనా.. భారత్‌కు ఓ హెచ్చరిక!


కరోనా వైరస్.. లక్షణాలు..జాగ్రత్తలు


గాంధీ ఆస్పత్రిలో మీడియాపై ఆంక్షలు


కరోనా ఎఫెక్ట్‌..ఐపీఎల్‌ నిర్వహణపై సందిగ్ధం!


logo