గురువారం 02 ఏప్రిల్ 2020
Telangana - Mar 17, 2020 , 17:59:04

రూ.50 లక్షలతో ఉద్యోగి పరార్‌

రూ.50 లక్షలతో ఉద్యోగి పరార్‌

సికింద్రాబాద్‌: ఏటీఎంలో పెట్టే నగదు తీసుకుని ఏజెన్సీ ఉద్యోగి పరారయ్యాడు. చిలకలగూడ పోలీస్‌స్టేషన్‌ పరిధిలో రూ.50 లక్షలతో ప్రైవేటు ఏజెన్సీ ఉద్యోగి పరారైనట్లు కేసు నమోదైంది. ఏజెన్సీ ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న చిలకలగూడ పోలీసులు పరారైన నిందితుడి కోసం గాలిస్తున్నారు.  గతంలో పంజాబ్, హర్యాణా, మధ్యప్రదేశ్ రాష్ట్రాల్లో ఇటువంటి చోరీలు జరిగేవి. తెలంగాణలో పెద్ద మొత్తంలో ఏటీఎం డబ్బు చోరీకి గురికావడంతో పోలీసులు అప్రమత్తమయ్యారు.

ఏటీఎంలో డబ్బులు పెట్టే ఏజెన్సీ ఉద్యోగుల వివరాలు పోలీసులకు అందివ్వాలని ఆదేశాలు జారీ చేశారు. ఇంతకు ముందు ఇలాగే రూ.20 లక్షల డబ్బుతో పరారైన ఉత్తరప్రదేశ్ కు చెందిన ఉద్యోగిని మన పోలీసులు పట్టుకున్న సంగతి తెలిసిందే. సీసీ పుటేజీల ఆధారంగా పోలీసులు దర్యాప్తు చేపట్టారు. డబ్బుతో పరారైన వ్యక్తి వెళ్లిన వాహనాన్ని గుర్తించారు. ఆ కారు యజమానికి ప్రశ్నిస్తున్నారు. సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ లో ఆ వ్యక్తి దిగినట్లు కారు డైవర్ విచారణలో తెలిపాడు. 


logo