శనివారం 08 ఆగస్టు 2020
Telangana - Jul 21, 2020 , 13:49:07

41 హెక్టార్లలో హరితహారం..పుడమి తల్లికి పచ్చల హారం

41 హెక్టార్లలో హరితహారం..పుడమి తల్లికి పచ్చల హారం

ఖమ్మం : జిల్లాలోని సత్తుపల్లి నియోజకవర్గ కేంద్రం సింగరేణి ఆధ్వర్యంలో జేవీఆర్ ఓపెన్ కాస్ట్ ఆవరణలోని 41 హెక్టార్లలో చేపట్టిన హరితహారం కార్యక్రమాన్ని రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ సీఎం కేసీఆర్ ప్రతిష్ఠాత్మకంగా ప్రారంభివంచిన హరితహారంతో రాష్ట్రం ఆకుపచ్చని తెలంగాణగా మారిందన్నారు. అనంతరం మంత్రి  ఆరో విడుత హరితహారంలో భాగంగా మొక్కలు నాటారు. కార్యక్రమంలో ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య , ఎమ్మెల్సీ బాలసాని లక్ష్మీనారాయణ , జిల్లా కలెక్టర్ ఆర్వీ కర్ణన్, సింగరేణి, అటవీశాఖ అధికారులు ఉన్నారు.
logo