శుక్రవారం 30 అక్టోబర్ 2020
Telangana - Oct 16, 2020 , 22:15:26

మునిగిన ఎల్లూరు లిఫ్ట్ మోటార్లు

మునిగిన ఎల్లూరు లిఫ్ట్ మోటార్లు

నాగర్‌కర్నూల్ : జిల్లాలోని ప్రతిష్టాత్మక ఎంజీఏఎల్ఐ మొదటి లిఫ్ట్ మోటార్లు మునిగిపోయాయి. కృష్ణానదికి భారీ ఎత్తున వరద జలాలు పోటెత్తున్న క్ర‌మంలో శుక్రవారం కొల్లాపూర్ మండలం ఎల్లూరు(మొదటి) జలాశయం వద్ద మోటార్లు ప్రారంభించారు. ఇందులో భాగంగా ముందుగా ఒకటో మోటార్ రన్ చేశారు. ఆ వెంటనే మూడో మోటార్‌ను ప్రారంభించారు. ఈ క్రమంలో ఒక్క‌సారిగా లిఫ్ట్‌లో సాంకేతికలోపం తలెత్తింది. సర్జిపూల్ నుంచి పంప్ హౌజ్ లోకి నీళ్లు చేరాయి. సర్జిపూల్ గోడ కూలడంతోనే ఈ ఘటన చోటుచేసుకున్న‌ట్లుగా అధికారులు భావిస్తున్నారు. నీళ్లు భారీగా రావ‌డంతో మూడో ఫ్లోర్ వరకూ నీళ్లు చేరాయి. గతంలో 2015 లోనూ ఇలా ఓసారి జరిగింది. అనంతరం మ‌ళ్లీ ఇప్పుడు జ‌రిగింది. స‌మాచారం తెలిసిన ఎమ్మెల్యే బీరం హర్షవర్ధన్ రెడ్డి అధికారుల‌ను ఆరా తీశారు. ఘ‌ట‌న‌లో నేప‌థ్యంలో ఎల్లూరు పంప్ హౌస్‌ను ప‌రిశీలించేందుకు రాష్ట్ర వ్యవసాయశాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి ఎల్లూరుకు బ‌య‌లుదేరారు.