శనివారం 24 అక్టోబర్ 2020
Telangana - Sep 21, 2020 , 17:45:05

నాలాల పై దురాక్రమణల తొల‌గింపు పనులు వేగంగా చేపట్టాలి

నాలాల పై దురాక్రమణల తొల‌గింపు పనులు వేగంగా చేపట్టాలి

వరంగల్ అర్బన్ : కొద్ది రోజుల క్రితం భారీగా కురిసిన వ‌ర్షాలకు వ‌రంగ‌ల్ న‌గ‌రంలోని లోత‌ట్టు ప్రాంతాలు ముంపునకు గురయ్యాయి.  ముంపునకు కారణమైన నాలాల‌పై కబ్జాలను వేగంగా తొల‌గించాల‌ని పంచాయ‌తీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి ద‌యాక‌ర్ రావు అధికారుల‌ను ఆదేశించారు. వ‌రంగ‌ల్ మ‌హాన‌గ‌ర‌ మున్సిప‌ల్ కార్పొరేష‌న్ అభివృద్ధి, నాలాల‌పై దురాక్రమణలు, కట్టడాల తొల‌గింపు వంటి ప‌లు అంశాల‌పై మంత్రి  ఆర్ అండ్ బీ అతిథి గృహంలో స‌మీక్ష జ‌రిపారు. ఈ సంద‌ర్భంగా మంత్రి మాట్లాడుతూ..గ‌త ఆగ‌స్టు నెల‌లో కురిసిన భారీ వ‌ర్షాల కార‌ణంగా వ‌రంగ‌ల్ లోత‌ట్టు ప్రాంత‌లు జ‌ల‌మ‌య‌మైన సంగ‌తి తెలిసిందే. అయితే, ఆనాడు ప్రజలంతా ముక్త కంఠంతో నాలాల‌పై అక్రమ కట్టడాలను  తొల‌గించాల‌ని కోరార‌న్నారు. 


మంత్రి కేటీఆర్ కూడా వ‌రంగ‌ల్ పర్యటన సంద‌ర్భంగా ఇదే విష‌యాన్ని ప‌దే ప‌దే చెప్పార‌న్నారు. దీంతో ప్రజాభీష్టం మేర‌కు నాలాల‌పై కట్టడాలన్నింటిని తొల‌గించాలని నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. ఇప్పటికే చాలా వ‌ర‌కు దురాక్రమణలు తొల‌గింపు కూడా జ‌రిగిందన్నారు. ఇంకా మిగిలిన ప‌నులు వేగంగా పూర్తి చేయాలని క‌మిష‌న‌ర్ ప‌మేలా స‌త్పతిని మంత్రి ఆదేశించారు. అల‌స‌త్వం వ‌హించే అధికారుల‌పై చర్చయలు తీసుకోవాల‌ని సూచించారు. స‌మీక్షలో కలెక్టర్ రాజీవ్ గాంధీ హ‌న్మంతు, సీపీ ప్రమోద్, ఇత‌ర అధికారులు ఉన్నారు.


logo