శనివారం 28 నవంబర్ 2020
Telangana - Nov 13, 2020 , 17:35:26

జీహెచ్ఎంసీ.. పోటీ చేసే, బ‌ల‌ప‌రిచే వ్య‌క్తుల‌ అర్హ‌త‌లు

జీహెచ్ఎంసీ.. పోటీ చేసే, బ‌ల‌ప‌రిచే వ్య‌క్తుల‌ అర్హ‌త‌లు

హైద‌రాబాద్ : జీహెచ్ఎంసీ ఎన్నిక‌ల్లో పోటీచేసే అభ్య‌ర్థులు, వారిని బ‌ల‌ప‌రిచే వ్య‌క్తుల‌ అర్హ‌త‌ల‌ను తెలియ‌జేస్తూ రాష్ర్ట ఎన్నిక‌ల క‌మిష‌న‌ర్ సి. పార్థ‌సార‌ధి ప్ర‌క‌ట‌న‌ను విడుద‌ల చేశారు. పోటీచేసే అభ్యర్థులు, బలపరిచే వ్యక్తుల అర్హతలపై జీహెచ్ఎంసీ చట్టం, 1955 సెక్షన్ 36 లోని సబ్ సెక్షన్ 2 అదేవిధంగా 7 క్రింద అధికార పూర్వక ఆదేశాలు ఈ విధంగా ఉండ‌నున్నాయి. జీహెచ్ఎంసీ ఎన్నికలలో బలపరిచే వ్యక్తి అభ్యర్థి పోటీ చేస్తున్న వార్డులో రిజిస్టర్ కాబడిన ఓటరై ఉండాలి. పోటీ చేస్తున్న అభ్యర్థి జీహెచ్ఎంసీ పరిధిలోని ఏదైనా వార్డునందు రిజిస్టర్ కాబడిన ఓటరు అయిఉండాలి.

అట్టి అభ్యర్థి తాను రిజిస్టర్ కాబడిన వార్డుకు సంబంధించిన పూర్తి ఓటరు లిస్టు గాని, అభ్యర్థి పేరు ఉన్న భాగాన్ని గాని అధీకృత అధికారిచే ధృవీకరించబడిన కాపీని నామినేషన్‌తో పాటు సమర్పించాల్సి ఉంటుంది. అలాగే జీహెచ్ఎంసీ ఎన్నికలలో ఒక అభ్యర్థి ఒకటికంటే ఎక్కువ వార్డుల్లో నామినేషన్ దాఖలు చేయవచ్చు. కానీ అంతిమంగా ఒక్క వార్డులో మాత్రమే పోటీ చేయవలసి ఉంటుంది. మిగిలిన వార్డులలో అభ్యర్థిత్వాన్ని నిర్ణీత గడువులోగా ఉపసంహరించుకోవాల్సి ఉంటుంది. లేని పక్షంలో అభ్యర్థి నామినేషన్‌ను ఏ వార్డులోనూ పరిగణనలోకి తీసుకోబడదని రాష్ట్ర ఎన్నికల కమిషనర్ తెలిపారు.