e-Paper

Advertisement

E-Paper

Apps

Book Your Copy

Visit Telangana Today

Saturday, July 24, 2021
Home తెలంగాణ ఎలక్ట్రానిక్‌ హెల్మెట్‌

ఎలక్ట్రానిక్‌ హెల్మెట్‌

ఎలక్ట్రానిక్‌ హెల్మెట్‌
  • అందులోనే మైక్రో ఫ్యాన్‌, మస్కిటో నెట్‌, టార్చ్‌లైట్‌
  • పవర్‌ బ్యాంకుతో బ్లూటూత్‌, వాచ్‌, ఐపాడ్‌, వైఫై కనెక్షన్‌
  • అత్యవసర పరిస్థితుల్లో ఉపయోగించునేలా ఏర్పాట్లు
  • హాస్టల్‌ వెల్ఫేర్‌ ఆఫీసర్‌ పూర్ణచంద్రరావు అద్భుత సృష్టి

కొత్తగూడెం ఎడ్యుకేషన్‌, జూలై 10: బైక్‌ ప్రయాణంలో శిరస్సుకు రక్షణగా ఉపయోగించే హెల్మెట్‌ను బహుళ ప్రయోజనాలకు ఎందుకు ఉపయోగించకూడదు? ఈ ప్రశ్న మదిలో మెదిలిన వెంటనే ఓ వసతిగృహ సంక్షేమాధికారి తన ఆలోచనకు పదును పెట్టారు. ఓవైపు వృత్తి ధర్మాన్ని పాటిస్తూనే మరోవైపు చిన్న చిన్న విద్యుత్‌ ఉపకరణాలతో మల్టీపర్పస్‌ ఎలక్ట్రానిక్‌ హెల్మెట్‌ను ఆవిష్కరించారు. ఆయనే మహబూబాబాద్‌ జిల్లా బయ్యారం మండలానికి చెందిన అంబటి పూర్ణచందర్‌రావు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఎస్సీ వెల్ఫేర్‌ విభాగంలో వసతిగృహ సంక్షేమాధికారిగా ఆయన విధులు నిర్వర్తిస్తున్నారు. మైక్రో ఫ్యాన్‌, మస్కిటో నెట్‌, బ్లూటూత్‌, టార్చ్‌లైట్‌, వాచ్‌, ఐపాడ్‌, వైఫై, సీసీ కెమెరా, పవర్‌ బ్యాంక్‌ లాంటి పలు రకాల విద్యుత్‌ ఉపకరణాలను కలిగి ఉండటం ఈ హెల్మెట్‌ ప్రత్యేకత. దాదాపు నెల రోజులు శ్రమించి తయారు చేసిన ఈ హెల్మెట్‌ను ఈ ఏడాది స్వాతంత్య్ర దినోత్సవ వేడుకల్లో ప్రదర్శించాలనుకుంటున్నట్లు ఆయన ‘నమస్తే తెలంగాణ’కు తెలిపారు. ఇదే స్ఫూర్తితో కార్లలో సీసీ కెమెరాలు ఏర్పాటు చేయడానికి ప్రయత్నిస్తున్నట్లు చెప్పారు.

ఉపయోగాలెన్నో

  • హెల్మెట్‌లోని వివిధ డివైజ్‌లకు విద్యుత్తును అందించేందుకు ఓ పవర్‌ బ్యాంకును అమర్చారు. దీని సాయంతో మొబైల్‌ ఫోన్‌ను కూడా చార్జ్‌ చేసుకోవచ్చు.
  • హెల్మెట్‌ ముందు భాగంలో ఫైబర్‌ గ్లాస్‌కు బదులుగా అమర్చిన మస్కిటో నెట్‌ పురుగులను అడ్డుకొంటుంది.
  • బైక్‌ డ్రైవ్‌ చేస్తున్న వ్యక్తి తలకు లోపల మైక్రో ఫ్యాన్‌ ద్వారా గాలి వీస్తుంది.
  • హెల్మెట్‌ ముందు భాగంలోని టార్చ్‌లైట్‌ ద్వారా రాత్రి వేళల్లో మరికొంత వెలుతురును పొందవచ్చు.
  • హెల్మెట్‌ లోపల అమర్చిన వైఫై, సీసీ కెమెరా, బ్లూటూత్‌లు అత్యవసర పరిస్థితుల్లో ఉపయోగపడతాయి.
- Advertisement -
- Advertisement -
Advertisement
-Advertisement-

తాజావార్తలు

Advertisement
ఎలక్ట్రానిక్‌ హెల్మెట్‌
ఎలక్ట్రానిక్‌ హెల్మెట్‌
ఎలక్ట్రానిక్‌ హెల్మెట్‌

ట్రెండింగ్‌

Advertisement