గురువారం 02 ఏప్రిల్ 2020
Telangana - Mar 19, 2020 , 21:40:05

స్తంభంపై నుంచి పడి విద్యుత్‌ ఉద్యోగి మృతి

స్తంభంపై నుంచి పడి విద్యుత్‌ ఉద్యోగి మృతి

అమ్రాబాద్‌  ; నాగర్‌కర్నూల్‌ జిల్లా మండల పరిధిలోని శ్రీశైలం ప్రాజెక్టు టీఎస్‌జన్‌కోలో ఎడమగుట్ట విద్యుత్‌ స్టేషన్‌లో ఆర్టిజన్‌ గ్రేడ్‌-2గా విధులు నిర్వహిస్తున్న జగ్గిలి మల్లికార్జున విధులకు హాజరై విద్యుత్‌ స్తంభంపై మరమత్తులు చేస్తుండగా ప్రమాదవశత్తు కిందపడి మృతి చెందాడు. బంధువులు తెలిపిన సమాచారం ప్రకారం.. మల్లికార్జున్‌తో పాటు విధులు నిర్వహిస్తూ స్తంభంపై నుంచి కిందపడిన వెంటనే తోటి  ఉద్యోగులు అతన్ని చికిత్స కోసం జన్‌కోకు సంబంధించిన అంబులెన్స్‌లో సమీపంలోని ఏపీ కర్నూల్‌ జిల్లా సున్నిపెంట ప్రభుత్వ వైద్య కేంద్రానికి తరలించారు. అప్పటికే మల్లికార్జున్‌(38) మరణించాడని వైద్యులు తెలిపారు. అతనికి భార్యతో పాటు ఇద్దరు కుమారులున్నారు. పోస్టుమార్టం తరువాత మృతదేహాన్ని కుటుంబ సభ్యులకు అందజేశామని, అతన్ని భార్య చంద్రకళ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని ఈగలపెంట ఎస్సై భద్రీనాథ్‌ తెలిపారు. 


logo
>>>>>>