గురువారం 24 సెప్టెంబర్ 2020
Telangana - Sep 15, 2020 , 14:58:56

'పాత‌బ‌స్తీలో విద్యుత్ స‌ర‌ఫ‌రాను మెరుగుప‌రిచాం'

'పాత‌బ‌స్తీలో విద్యుత్ స‌ర‌ఫ‌రాను మెరుగుప‌రిచాం'

హైద‌రాబాద్ : ‌తెలంగాణ రాష్ర్టం ఏర్ప‌డిన త‌ర్వాత న‌గ‌రంలోని పాత‌బస్తీలో విద్యుత్ స‌ర‌ఫ‌రాను మెరుగుప‌రిచామ‌ని విద్యుత్ శాఖ మంత్రి జ‌గ‌దీశ్ రెడ్డి స్ప‌ష్టం చేశారు. విద్యుత్ రంగంలో తెలంగాణ సాధించిన ప్రగతి, కేంద్ర ప్రభుత్వం తీసుకొస్తున్న విద్యుత్ సవరణ బిల్లు, శ్రీశైలం పవర్ హౌస్ లో జరిగిన అగ్ని ప్రమాదంపై శాస‌న‌స‌భ‌లో స్వ‌ల్ప‌కాలిక చ‌ర్చ సంద‌ర్భంగా యాకుత్‌పుర ఎంఐఎం ఎమ్మెల్యే పాషా ఖాద్రీ అడిగిన ప్ర‌శ్న‌ల‌కు మంత్రి జ‌గ‌దీశ్ రెడ్డి స‌మాధానం ఇచ్చారు. విద్యుత్ రంగంలో ప్ర‌భుత్వ చ‌ర్య‌ల‌ను పాషా ఖ‌ద్రీ అభినందించ‌డం సంతోషించ‌ద‌గ్గ విష‌య‌మ‌న్నారు. మాద‌న్న‌పేట‌లో ట్రాన్స్‌ఫార్మ‌ర్ రిపేర్ సెంట‌ర్ ఇచ్చామ‌ని మంత్రి తెలిపారు. పాత‌బ‌స్తీలో అండ‌ర్ గ్రౌండ్ కేబుల్ ప‌ని ప్రారంభ‌మైంది. 206కి.మీ. పూర్తి చేశాం. పాత‌బ‌స్తీకి కొత్త స‌బ్ స్టేష‌న్లు కూడా మంజూరు చేశాం. మొత్తం 15 స‌బ్ స్టేష‌న్లు మంజూరు చేసి 9 పూర్తి చేశామ‌న్నారు. తెలంగాణ ఏర్ప‌డిన త‌ర్వాత  పాత‌బ‌స్తీలో దాదాపు 1300 కోట్లు ఖ‌ర్చు పెట్టామ‌ని మంత్రి జ‌గ‌దీశ్ రెడ్డి తెలిపారు. 


logo