సోమవారం 18 జనవరి 2021
Telangana - Jan 07, 2021 , 01:39:12

పండ్ల వ్యర్థాల నుంచి విద్యుత్తు

పండ్ల వ్యర్థాల నుంచి విద్యుత్తు

  • పరిశీలించి నివేదించాలని కమిటీకి మంత్రి నిరంజన్‌రెడ్డి ఆదేశం

హైదరాబాద్‌, జనవరి 6 (నమస్తే తెలంగాణ): మార్కెట్లలో లభ్యమయ్యే పండ్లు, కూరగాయల వ్యర్థాల నుంచి విద్యుత్తు ఉత్పత్తికి చర్యలు తీసుకుంటున్నట్టు వ్యవసాయశాఖ మంత్రి నిరంజన్‌రెడ్డి తెలిపారు. బుధవారం మంత్రుల నివాసంలో జరిగిన ఆగ్రోస్‌ బోర్డు సమావేశంలో పలు అంశాలపై చర్చించారు. వ్యర్థాల నుంచి విద్యుత్తు ఉత్పత్తికి సంబంధించి ఓ కమిటీని ఏర్పాటుచేసినట్టు ఆయన తెలిపారు. కమిటీ.. మహీంద్ర కంపెనీ సహకారంతో ఏపీ, మధ్యప్రదేశ్‌లో నిర్వహిస్తున్న ప్లాంట్లను పరిశీలిస్తుందని తెలిపారు. కమిటీ ఇచ్చే నివేదిక ఆధారంగా తదుపరి చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు. రైతులను ఆధునిక వ్యవసాయం వైపు మళ్లించే ప్రయత్నం చేయాలని చెప్పారు. కూరగాయల సాగుకు ప్రభుత్వం ఎంతగానో ప్రోత్సాహం అందిస్తున్నదని తెలిపారు. సమావేశంలో వ్యవసాయశాఖ కార్యదర్శి జనార్దన్‌రెడ్డి, ఆగ్రోస్‌ ఎండీ రాములు తదితరులు పాల్గొన్నారు.