మంగళవారం 01 డిసెంబర్ 2020
Telangana - Oct 24, 2020 , 21:42:00

అవిశ్రాంత సూర్యులు..కరెంటోళ్లు..

అవిశ్రాంత సూర్యులు..కరెంటోళ్లు..

హైదరాబాద్‌: ఎటు చూసినా నీళ్లే.. ఏ దిక్కు చూసినా వరదే..నీళ్లు ఖాళీ కానిదే ఏం చేయలేని పరిస్థితి. వరద తగ్గి పని ప్రారంభించాలనుకుంటే మళ్లీ వర్షం. అన్నీ ప్రతికూల పరిస్థితులే. ఒకవైపు కరెంట్‌ లేకపోతే జనం తట్టుకోలేరు. మరోవైపు సరఫరా చేసి ఏదైనా సమస్య తలెత్తితే అసలుకే మోసం. ఇంటికి వెళ్లేది లేదు..దొరికింది తినడం..సబ్‌స్టేషన్లు లేదంటే ఆఫీసుల్లోనే నిద్రించడం..సమస్య వస్తే క్షణాల్లోనే రంగంలోకి దిగడం..ఇవి విద్యుత్‌శాఖ ఇంజినీర్లు, సిబ్బంది పడుతున్న కఠోర శ్రమకు నిదర్శనాలు. భారీ వర్షాలు అవస్థలు తెచ్చిపెట్టినా..నగరవాసులకు కరెంట్‌ ఇచ్చేందుకు అవిశ్రాంతంగా శ్రమించారు.. ఇంకా శ్రమిస్తూనే ఉన్నారు.. వారికి నమస్తే తెలంగాణ యూట్యూబ్‌ చానల్‌ ఈ వీడియో ద్వారా ‘సెల్యూట్‌’ చెబుతోంది. ఈ కింది వీడియోను చూసి, మరిన్ని ఆసక్తికర కథనాల కోసం https://www.youtube.com/namasthetelangaanaను సబ్‌స్ర్కైబ్‌ చేసుకోండి. 

లోకల్ టు గ్లోబల్.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్లో నమస్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.