ఈ నెల 5న ఆల్‌టైం రికార్డు: సీఎండీ ప్రభాకర్‌రావు
హైదరాబాద్, మార్చి 10 (నమస్తే తెలంగాణ): రాష్ట్రంలో వారం రోజులుగా విద్యుత్తు డిమాండ్ 13వేల మెగావాట్లకుపైగా ఉంటున్నది. ఈ నెల 5న ఉదయం 8.06 గంటలకు 13,468 మెగావాట్ల ఆల్‌టైమ్ రికార్డు నమోదయింది. ఇది సమైక్య రాష్ట్రంలో నమోదైన గరిష్ఠ విద్యుత్తు డిమాండ్ కంటే చాలా ఎక్కువ. గతేడాది ఫిబ్రవరి 28న 13,168 మెగావాట్ల గరిష్ఠ డిమాండ్ నమోదైంది. 18,000 మెగావాట్ల డిమాండ్ వచ్చినా.. ఎలాంటి ఇబ్బందులు ఎదురుకావని ట్రాన్స్‌కో, జెన్కో సీఎండీ దేవులపల్లి ప్రభాకర్‌రావు తెలిపారు.