శనివారం 30 మే 2020
Telangana - May 06, 2020 , 02:17:18

మళ్లీ అవే విద్యుత్‌ బిల్లులు

మళ్లీ అవే విద్యుత్‌ బిల్లులు

  • గత మే నెల నాటి చార్జీలే చెల్లించాలి

హైదరాబాద్‌, నమస్తే తెలంగాణ: విద్యుత్‌ బిల్లుల విషయంలో ఏప్రిల్‌లో పాటించిన విధానాన్నే ఈ నెలలో కూడా అనుసరించేలా తెలంగాణ విద్యుత్‌ నియంత్రణ మండలి (టీఎస్‌ఈఆర్సీ) విద్యుత్‌ సంస్థలకు అనుమతిచ్చింది. లాక్‌డౌన్‌లో విద్యుత్‌ సిబ్బంది ఇంటింటికీ తిరిగి మీటర్‌ రీడింగ్‌ నమోదుచేసే అవకాశంలేనందున ఈ వెసులుబాటు కల్పించింది. గృహ వినియోగదారులు ఎల్టీ-1, ఎల్టీ-6 (ఏ) వీధిదీపాలు, (బీ) రక్షిత మంచినీటి సరఫరా (పీడబ్ల్యూఎస్‌) క్యాటగిరీలవారు 2019 మే నెల బిల్లు ఆధారంగానే ఈ నెల బిల్లు చెల్లించాలని విద్యుత్‌ సంస్థలు సూచించాయి. ఈ క్యాటగిరీలలో గతేడాది మే నెల తర్వాత కనెక్షన్‌ పొందినవారు 2020 మార్చి నెల బిల్లు ఆధారంగా చెల్లించాలని పేర్కొన్నాయి.


logo