మంగళవారం 29 సెప్టెంబర్ 2020
Telangana - Sep 13, 2020 , 16:30:37

సీఎం కేసీఆర్ దార్శనికతతోనే విద్యుత్ వెలుగులు : మంత్రి కొప్పుల

సీఎం కేసీఆర్ దార్శనికతతోనే విద్యుత్ వెలుగులు : మంత్రి కొప్పుల

జగిత్యాల : సీఎం కేసీఆర్ విద్యుత్ రంగంలో విప్లవాత్మకమైన మార్పులు తీసుకొచ్చారని సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్ అన్నారు. జిల్లా కేంద్రంలో రూ. 89.53 లక్షల అంచనా వ్యయంతో రాష్ట్ర విద్యుత్ పంపిణీ సంస్థ సూపరింటెండెంట్ ఇంజినీర్ (S.E) కార్యాలయ భవన  నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ..తెలంగాణ వస్తే రాష్ట్రం అంధకారమవుతుందన్న వాళ్ల నోళ్లను మూయిస్తూ కరెంట్ కష్టాలను తీర్చారన్నారు.

ముఖ్యంగా రైతుల కోసం 24 గంటలు విద్యుత్ సరఫరా చేయడం గొప్ప విషయమన్నారు. సీఎం కేసీఆర్ ఒక ప్రణాళిక బద్ధంగా ముందు చూపుతో పనిచేయడంతోనే ఇది సాధ్యమైందన్నారు. కార్యక్రమంలో జడ్పీ చైర్ పర్సన్ దావ వసంత, స్థానిక ఎమ్మెల్యే సంజయ్ కుమార్, మున్సిపల్ చైర్ పర్సన్ భోగ శ్రావణి, ప్రజాప్రతినిధులు, విద్యుత్ అధికారులు పాల్గొన్నారు.
logo