బుధవారం 28 అక్టోబర్ 2020
Telangana - Sep 22, 2020 , 19:54:39

గ్రాడ్యుయేట్ ఎన్నిక‌ల ఓట‌ర్ న‌మోదు ప్ర‌క్రియ‌ను ప్రారంభించిన ఈసీ

గ్రాడ్యుయేట్ ఎన్నిక‌ల ఓట‌ర్ న‌మోదు ప్ర‌క్రియ‌ను ప్రారంభించిన ఈసీ

హైద‌రాబాద్ : ఉమ్మడి రంగారెడ్డి-హైదరాబాద్-మహబూబ్‌న‌గ‌ర్ గ్రాడ్యుయేట్ అదేవిధంగా ఉమ్మడి ఖమ్మం-నల్ల‌గొండ‌-వరంగల్ గ్రాడ్యుయేట్ ఎన్నికల ఓటర్ నమోదు ప్రక్రియను కేంద్ర ఎన్నికల సంఘం ప్రారంభించింది. వచ్చే నెల 1వ తేదీ నుండి ఓటర్ నమోదు నోటీస్ జారీ చేయాల్సిందిగా రాష్ర్ట ముఖ్య‌ ఎన్నిక‌ల అధికారుల‌ను ఆదేశించింది. నవంబర్ 6 వరకు కొత్త ఓటర్ నమోదుకు దరఖాస్తుల స్వీకరించ‌నున్నారు. డిసెంబర్ 1న ఓటర్ జాబితా ముసాయిదా విడుదల చేస్తారు. డిసెంబర్ 31 వరకు అభ్యంతరాలు స్వీకరణ. 12, జనవరి 2021 వరకు అభ్యంత‌రాల పరిష్కారం. జనవరి 18న  తుది ఓటరు జాబితాను విడుదల చేయ‌నున్నారు.  మ‌హ‌బూబ్‌న‌గ‌ర్‌, రంగారెడ్డి, హైద‌రాబాద్ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీగా ఎన్‌. రామ‌చంద్ర‌రావు, ఖ‌మ్మం, న‌ల్ల‌గొండ‌, వ‌రంగ‌ల్ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీగా ప‌ల్లా రాజేశ్వ‌ర్‌రెడ్డి 29 మార్చి 2021న ప‌ద‌వీ విర‌మ‌ణ పొంద‌నున్నారు. ఈ రెండు స్థానాల‌కు ఎన్నిక జ‌ర‌గ‌నుంది.


logo