గురువారం 24 సెప్టెంబర్ 2020
Telangana - Sep 13, 2020 , 15:40:31

ఎన్నిక ఏదైనా గెలుపు టీఆర్ఎస్ దే : మంత్రి సత్యవతి రాథోడ్

ఎన్నిక ఏదైనా గెలుపు టీఆర్ఎస్ దే : మంత్రి సత్యవతి రాథోడ్

మహబూబాబాద్ : రానున్న పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల కోసం టీఆర్ఎస్ శ్రేణులంతా సమిష్టిగా పని చేయాలని గిరిజన సంక్షేమ శాఖ మంత్రి సత్యవతి రాథోడ్ పిలుపునిచ్చారు. ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో ఎంపీ మాలోతు కవిత, ఎమ్మెల్యే రెడ్యానాయక్, జడ్పీ చైర్ పర్సన్ కుమారి ఆంగోతు బిందు, మున్సిపల్  చైర్మన్ డాక్టర్ రామ్మోహన్ రెడ్డి, ఇతర నాయకులతో కలిసి పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలపై మంత్రి సన్నాహక సమావేశం నిర్వహించారు. 

ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ..వరంగల్ – ఖమ్మం-నల్గొండ పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానం ప్రస్తుతం సిట్టింగ్ పల్లా రాజేశ్వర్ రెడ్డిది కావడంతో.. వచ్చే ఎన్నికల్లో మరింత ఎక్కవ మెజారిటీతో ఈ స్థానంలో విజయం సాధించాలన్నారు.  ఎన్నిక ఏదైనా గెలుపు టీఆర్ఎస్ దే అన్నారు. ఈసారి ఎన్నికల్లో మరింత ఎక్కువ మెజారిటీతో రాజేశ్వర్ రెడ్డిని గెలిపించాలన్నారు. మనం చేసే మంచి పనులు గుర్తించి ఎన్నిక ఏదైనా ఇక్కడ మనకు మద్దతు ఇస్తున్నారు.

అసెంబ్లీ, మున్సిపల్  ఎన్నికల్లో అన్ని వర్గాల నుంచి మనకు మద్దతు ఇచ్చారు. రేపటి ఎమ్మెల్సీ ఎన్నికల్లో కూడా మద్దతు మనకే దక్కుతుందన్నారు. దీనికి పట్టభద్రులను ఓటర్లుగా నమోదు చేయించాలన్నారు.  ఉమ్మడి వరంగల్ జిల్లా నుంచి 1,05,000 మంది ఉండగా.. మహబూబాబాద్ నుంచి దాదాపు 7000పైగా మంది ఓటర్లుగా ఉన్నారని తెలిపారు. ఈ సభ్యత్వం అక్టోబర్ 1 నుంచి ప్రారంభమై నవంబర్ 15వ తేదీ వరకు జరుగుతుందని పేర్కొన్నారు. కొత్తగా అందరినీ మళ్లీ ఓటర్లుగా నమోదు చేయించాలన్నారు. అలాగే సీఎం కేసీఆర్  తీసుకొచ్చిన కొత్త రెవెన్యూ చట్టంతో పేదలకు, దళితులకు, గిరిజనులకు పెద్ద ఎత్తున లాభం చేకూరుతుందన్నారు.

logo