బుధవారం 21 అక్టోబర్ 2020
Telangana - Oct 01, 2020 , 14:35:50

వృద్ధులు మన జాతి సంపద : మంత్రి కొప్పుల ఈశ్వర్

వృద్ధులు మన జాతి సంపద : మంత్రి కొప్పుల ఈశ్వర్

జగిత్యాల : వృద్ధులు మన జాతి సంపద. మన వారసత్వానికి ప్రతినిధులు. వారిని గౌరవించడం మన బాధ్యత అని సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్ అన్నారు. ప్రపంచ వయోవృద్ధుల దినోత్సవాన్ని పురస్కరించుకొని జిల్లా కేంద్రంలో గల గాయత్రి విశ్వ కర్మ వృద్ధుల ఆశ్రమంలో పండ్లను పంపిణీ చేశారు. ఈ సదందర్భంగా మంత్రి మాట్లాడుతూ..వృద్ధుల సంక్షేమం కోసం తెలంగాణ ప్రభుత్వం ఎంతో కృషి చేస్తుందన్నారు. ప్రతి జిల్లాకు ఒక వృద్ధాశ్రమం ఏర్పాటు చేస్తామన్నారు. సీనియర్ సిటిజన్స్ ఆత్మగౌరవం కోసమే ఆసరా పింఛన్లు అందిస్తున్నామని పేర్కొన్నారు.

వృద్ధుల సంక్షేమం, ఆహారం, ఆరోగ్యం తదితర విషయాల పరిశీలన, ఆశ్రమ నిర్వహణ సమస్యల పరిష్కారం, నిపుణుల సూచనలు, సలహాలు తదితర అంశాల కోసం రాష్ట్ర వ్యాప్తంగా ప్రత్యేకమైన ఆప్ ను ప్రారంభిస్తున్నామని తెలిపారు. కార్యక్రమంలో జడ్పీ చైర్ పర్సన్ దావ వసంత, స్థానిక శాసన సభ్యుడు సంజయ్, మున్సిపాలిటీ చైర్ పర్సన్ బోగ శ్రావణి, కలెక్టర్ రవి, ఆర్డీవో మాధురి, జిల్లా వయోవృద్ధుల సంక్షేమ అధికారి నరేష్ పాల్గొన్నారు.logo