ఆదివారం 31 మే 2020
Telangana - May 10, 2020 , 22:43:51

కరోనాను జయించిన వృద్ధురాలు

కరోనాను జయించిన వృద్ధురాలు

ఎదులాపురం : ఆదిలాబాద్‌ జిల్లా కేంద్రంలోని ఖానాపూర్‌కు చెందిన 80ఏళ్ల  వృద్ధురాలు కరోనాను జయించింది. హైదరాబాద్‌లోని గాంధీలో చికిత్స పొందుతూ శనివారం రాత్రి డిశ్చార్జి అయ్యింది. సెకండరీ కాంటాక్ట్‌ కింద గత నెల 19న కరోనా పాజిటివ్‌ రాగా చికిత్స కోసం ఆమెను గాంధీకి తరలించారు. 20 రోజుల పాటు చికిత్స పొందిన వృద్ధురాలు తాజాగా కరోనా నుంచి కోలుకుంది.  రెండు సార్లు నిర్వహించిన పరీక్షల్లో నెగెటివ్‌ రావడంతో శనివారం రాత్రి డిశ్చార్జి చేసినట్లు   జిల్లా వైద్య అధికారి తొడసం చందు తెలిపారు.


logo