ఆదివారం 24 జనవరి 2021
Telangana - Jan 06, 2021 , 02:11:06

మరణంలోనూ వీడని తోడు

మరణంలోనూ  వీడని తోడు

  • అనారోగ్యంతో చనిపోయిన భర్త  
  • తట్టుకోలేక గంటల వ్యవధిలోనే భార్య.. 

జఫర్‌గఢ్‌, జనవరి 5: ఐదు దశాబ్దాల వివాహ బంధంలో భర్త కు ఎల్లవేళలా తోడూనీడలా ఉన్న మహిళ.. మరణంలోనూ భర్త వెంటే అడుగులేసింది. అనారోగ్యంతో భర్త మృతి చెందగా.. తట్టుకోలేక గంటల వ్యవధిలోనే భార్య మరణించిన విషాద ఘటన జనగామ జిల్లా జఫర్‌గఢ్‌లో మంగళవారం చోటుచేసుకొన్నది. గ్రామానికి చెందిన రొడ్డ మల్లయ్య(70), రొడ్డ ఎల్లమ్మ(65) దంపతులకు దాదాపు 50 ఏండ్ల కింద వివాహమైంది. వీరికి సంతానం లేకపోవడం తో దాయాదుల పిల్లలనే తమ పిల్లలుగా భావిస్తూ కాలం వెళ్లదీస్తున్నారు. ఈ క్రమంలో సోమవారం అర్ధరాత్రి అనారోగ్యం తో మల్లయ్య మృతి చెందాడు. భర్త మరణంతో దిక్కుతోచని ఎల్లమ్మ రోదిస్తూ మంగళవారం తెల్లవారుజామున మల్లయ్య మృతదేహం పక్కనే కుప్పకూలింది. భార్యాభర్తలు ఒకేరోజు చనిపోవడంతో గ్రామంలో విషాదం అలుముకొన్నది. logo