బుధవారం 05 ఆగస్టు 2020
Telangana - Jul 11, 2020 , 00:30:31

వృద్ధ దంపతుల ఆత్మహత్య

వృద్ధ దంపతుల ఆత్మహత్య

  • కొడుకులకు భారం కావొద్దనే..

ఖానాపురం: అనారో గ్య సమస్యలతో కొడుకులకు భారం కావొద్దన్న ఉద్దేశంతో వృద్ధ దంపతులు ఆత్మహత్య చేసుకున్నారు. ఈ  ఘట న వరంగల్‌ రూరల్‌ జి ల్లా ఖానాపురం మండ లం అశోక్‌నగర్‌లో శుక్రవారం జరిగింది. గ్రామానికి చెందిన తొగరు అల్లూరు(80), ఎల్లమ్మ(75) దంపతులు. వీరికి ఇద్దరు కుమారులు, ఓ కుమార్తె. అల్లూరు గొర్రెల కాపరిగా పనిచేస్తుండగా, ఎల్లమ్మ కూలి పనులకు వెళ్తుండేది. నాలుగేండ్ల క్రితం అల్లూ రు కాలికి గాయమై పూర్తిగా దెబ్బతింది. కొద్ది నెలలుగా ఎల్లమ్మ కూడా అనారోగ్యంతో బాధపడుతున్నది. వృద్ధాప్యంలో కొడుకులకు భారం కావొద్దని భావించిన వీరు శుక్రవారం తెల్లవారుజామున ఇంట్లోనే పురుగుల మందు తాగారు. కుటుంబ సభ్యులు గమనించగా అప్పటికే విగతజీవులయ్యా రు. పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు. 


logo