హైదరాబాద్, జూలై 18 (నమస్తే తెలంగాణ): కొత్తగా ఐషర్ 380 సూపర్ పవర్ ట్రాక్టర్‌ను ఆ కంపెనీ ప్రతినిధులు మార్కెట్లోకి విడుదలచేశారు. భారీ వ్యవసాయ యంత్రాల నిర్వహణను ఈ ట్రాక్టర్ సులభతరం చేస్తుందని ప్రతినిధులు తెలిపారు. ఉత్తమ రోటొవేటర్ ట్రాక్టర్‌గా కూడా పనిచేస్తుందని పేర్కొన్నారు. పెద్దటైర్లు ఉండటం వల్ల కఠిన మైదానాల్లో కూడా సజావుగా పనిచేస్తుందని వెల్లడించారు. సౌకర్యవంతమైన స్టీరింగ్ విధానం వల్ల ట్రాక్టర్‌ను ఎక్కువ సేపు నడిపినా డ్రైవర్ అలసిపోడని వివరించారు. ఈ ట్రాక్టర్లో అనేక నూతన, అధునాతన సౌకర్యాలు ఉన్నాయని తెలిపారు.