మంగళవారం 29 సెప్టెంబర్ 2020
Telangana - Aug 09, 2020 , 06:34:39

యూజీసీ సభ్యులుగా ఇఫ్లూ వీసీ, ఓయూ ప్రొఫెసర్‌

యూజీసీ సభ్యులుగా ఇఫ్లూ వీసీ, ఓయూ ప్రొఫెసర్‌

న్యూఢిల్లీ: హైదరాబాద్‌లోని ఇంగ్లిష్ అండ్ ఫారెన్ లాంగ్వేజస్ యూనివ‌ర్సిటీ (ఇఫ్లూ) వైస్ చాన్స‌ల‌ర్‌ ఇ.సురేష్‌కుమార్‌ యూనివర్సిటీ గ్రాంట్స్‌ కమిషన్ ‌(యూజీసీ) సభ్యుడిగా నియమితులయ్యారు. ఆయన నియామకం తక్షణం అమల్లోకి వస్తుందని కేంద్ర మానవ వనరుల అభివృద్ధి శాఖ (హెచ్ఆర్డీ) శ‌నివారం  రాత్రి విడుదల చేసిన నోటిఫికేషన్‌లో పేర్కొంది. ఆయనతో పాటు ఉస్మానియా విశ్వవిద్యాలయ ప్రొఫెసర్‌ శివరాజ్ కూడా యూజీసీ సభ్యుడిగా నియమితుల‌య్యారు. అదేవిధంగా హరియాణాలోని భగత్‌పూల్‌సింగ్‌ మహిళా విశ్వవిద్యాలయం ఉపకులపతి సుష్మాయాదవ్‌ కూడా యూజీసీ సభ్యురాలిగా నియమితులయ్యారు.


logo