సోమవారం 10 ఆగస్టు 2020
Telangana - Jul 22, 2020 , 19:29:27

ఇఫ్లూ ప్రొఫెసర్‌ ఆత్మహత్య

ఇఫ్లూ ప్రొఫెసర్‌ ఆత్మహత్య

హైదరాబాద్‌ : ఇంగ్లిష్‌ అండ్ ఫారిన్‌ లాంగ్వేజెస్‌ యూనివర్సిటీలో అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌గా పనిచేస్తున్న బీ రాహుల్‌ ఆత్మహత్య చేసుకున్నాడు. తార్నాకలోని ఆయన నివాసంలో ఫ్యాన్‌కు ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నట్లు పోలీసులు గుర్తించారు. 

విజయవాడకు చెందిన రాహుల్‌ (45) గత కొన్నాళ్లుగా తార్నాకలోని శ్రీకర్‌ అపార్ట్‌మెంట్స్‌లో నివసిస్తున్నారు. అయితే, బుధవారం ఉదయం ఆయన నివాసం నుంచి తీవ్రంగా దుర్వాసన రావడాన్ని గుర్తించిన ఇరుగుపొరుగు స్థానిక పోలీసులకు సమాచారమిచ్చారు. ఉస్మానియా యూనివర్సిటీ పోలీసులు శ్రీకర్‌ అపార్ట్‌మెంట్స్‌కు చేరుకుని తలుపులు బద్దలుకొట్టి చూడగా.. ముందు గదిలోనే ఫ్యానుకు ఉరేసుకుని ప్రాణాలు తీసుకున్నది కనిపించింది. ఆయన మృతదేహాన్ని పోస్ట్‌మార్టం నిమిత్తం పోలీసులు గాంధీమార్చురీకి తరలించారు. రెండు రోజుల క్రితం చనిపోయి ఉండవచ్చునని పోలీసులు అనుమానిస్తున్నారు. భార్యకు విడాకులిచ్చిన రాహుల్‌ గతకొంత కాలంగా ఒంటిరిగా జీవిస్తున్నాడు. రాహుల్‌ ఆత్మహత్యకు గల కారణాలను తెలుసుకుంటున్నామని ఓయూపీఎస్‌ ఎస్‌హెచ్‌వో రాజశేఖర్‌రెడ్డి చెప్పారు.


logo