ఆదివారం 20 సెప్టెంబర్ 2020
Telangana - Sep 01, 2020 , 13:12:48

దివ్యాంగుల సమస్యల పరిష్కారానికి కృషి : మంత్రి కొప్పుల

దివ్యాంగుల సమస్యల పరిష్కారానికి కృషి : మంత్రి కొప్పుల

హైదరాబాద్ : దివ్యాంగుల సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం సిద్ధంగా ఉంది. వారి సమస్యలను ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్తానని సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్ అన్నారు. హైదరాబాద్ మంత్రి క్యాంపు కార్యాలయంలో దివ్యాంగులు ఎదుర్కొంటున్న సమస్యలు, పరిష్కారాలపై దివ్యాంగుల సంక్షేమం కార్పొరేషన్ అధికారులతో మంత్రి మంత్రి సమీక్ష నిర్వహించారు.

 ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. ప్రభుత్వం నుంచి అమలవుతున్న సంక్షేమ పథకాలు పెన్షన్, రేషన్ కార్డులు మొదలగునవి దివ్యాంగులకు అందే విధంగా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. అర్హులైన వారికి సంబంధిచిన వివరాలు సేకరించి పూర్తి వివరాలతో ముఖ్యమంత్రికి వినతిపత్రం అందజేయాలన్నారు. కార్యక్రమంలో దివ్యాంగుల సంక్షేమ శాఖ ప్రత్యేక కార్యదర్శి దివ్య, డైరెక్టర్ శైలజ అధికారులు పాల్గొన్నారు.


logo