ఆదివారం 09 ఆగస్టు 2020
Telangana - Jul 13, 2020 , 12:02:06

పర్యావరణ పరిరక్షణకు కృషి చేయాలి : మంత్రి సబితా ఇంద్రారెడ్డి

పర్యావరణ పరిరక్షణకు కృషి చేయాలి : మంత్రి సబితా ఇంద్రారెడ్డి

చేవెళ్ల : పర్యావరణ పరిరక్షణకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని విద్యా శాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి అన్నారు. సోమవారం రంగారెడ్డి జిల్లా చేవెళ్ల మండలంలోని దుద్దాగు గ్రామంలో స్థానిక ఎమ్మెల్యే కాలే యాదయ్యతో కలిసి హారితహరం కార్యక్రమంలో భాగంగా మొక్కలు నాటారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ రాష్ట్రాన్ని హరిత తెలంగాణగా మార్చేందుకు సీఎం కేసీఆర్ కృషి చేస్తున్నారని అన్నారు.

ప్రభుత్వం ఆరో విడుత హరితహరాన్ని ఉద్యమంలా చేపడుతున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో డీసీసీబీ చైర్మన్ పి. కృష్ణారెడ్డి, ఎంపీపీ విజయలక్ష్మి, జడ్పీటీసీ మాలతీ, పార్టీ నాయకులు తదితరులు పాల్గొన్నారు.


లోకల్ టు గ్లోబల్.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్లో. నమస్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డోన్లోడ్ చేసుకోండి.


logo