బుధవారం 02 డిసెంబర్ 2020
Telangana - Nov 10, 2020 , 17:54:19

ఎన్నికల్లో ఇచ్చిన హామీల అమలుకు కృషి

ఎన్నికల్లో ఇచ్చిన హామీల అమలుకు కృషి

సంగారెడ్డి : ప్రజలకు ఎన్నికల్లో ఇచ్చిన అన్ని హామీలను నెరవేరుస్తున్నామని పటాన్‌చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్‌ రెడ్డి అన్నారు. మంగళవారం అమీన్‌పూర్‌ మున్సిపల్‌ పరిధిలోని పలు వార్డుల్లో రూ.72 లక్షల అంచనా వ్యయంతో నిర్మించ తలపెట్టిన అంతర్గత మురుగునీటి కాలువల నిర్మాణ పనులకు ఆయన శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. మున్సిపాలిటీల అభివృద్ధికి ప్రభుత్వం పెద్ద ఎత్తున నిధులు కేటాయిస్తుందని తెలిపారు.

ఎన్నికల్లో ఇచ్చిన హామీల మేరకు ప్రతి కాలనీలో వీధి దీపాలు, సీసీ రోడ్లు, అంతర్గత మరుగు నీటి కాలువలు, ఇంటింటికీ తాగునీరు అందిస్తున్నట్లు పేర్కొన్నారు. రాజకీయాలకు అతీతంగా పూర్తి పారదర్శకతతో ప్రజల అవసరాల మేరకు అభివృద్ధి పనులు చేపడుతున్నామని వివరించారు. కార్యక్రమంలో మున్సిపల్‌ చైర్మన్‌ తుమ్మల పాండురంగారెడ్డి, వైస్‌ చైర్మన్‌ నందారం నరసింహ గౌడ్‌, కమిషనర్‌ సుజాత, కౌన్సిలర్లు, కో ఆప్షన్‌ సభ్యులు, టీఆర్‌ఎస్‌ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.