బుధవారం 28 అక్టోబర్ 2020
Telangana - Oct 18, 2020 , 15:41:15

ముంపు ప్రాంతాలను సాధారణ స్థితికి తెచ్చేందుకు కృషి

ముంపు ప్రాంతాలను సాధారణ స్థితికి తెచ్చేందుకు కృషి

హైదరాబాద్‌ : ముంపు ప్రాంతాలను సాధారణ స్థితికి తెచ్చేందుకు అన్నివిధాలా కృషి చేస్తున్నామని జీహెచ్‌ఎంసీ కమిషనర్‌ లోకేశ్‌కుమార్‌ అన్నారు. ఈ నెల 13 నుంచి కురిసిన భారీ వర్షానికి పలు కాలనీలు నీటమునిగాయని పేర్కొన్నారు. నిన్న సాయంత్రమే దాదాపు ముంపు ప్రభావిత ప్రాంతాల్లోని 2100 కుటుంబాలను ఖాళీ చేయించామని తెలిపారు.  నగర వ్యాప్తంగా 35,309 కుటుంబాలు వరద ముంపు బారినపడ్డాయని, బాధిత కుటుంబాలకు ఎలాంటి ఇబ్బంది లేకుండా చూస్తున్నామని ఆయన చెప్పారు.

ఒక్కో కుటుంబానికి రూ.2,800 విలువైన వస్తువులను అందజేస్తున్నామన్నారు.  మరోమూడు రోజులు నగరంలో భారీ వర్షాలు కురిసే అవకాశముందని వాతావరణ శాఖ హెచ్చరికల నేపథ్యంలో అందుకు అనుగుణంగా ముందుజాగ్రత్త చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. అధికారులను అప్రమత్తం చేశామని, ప్రజలకు ఎలాంటి ఇబ్బంది లేకుండా చూస్తామని అన్నారు. 

లోక‌ల్ టు గ్లోబ‌ల్‌.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్‌లో. న‌మ‌స్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


logo