e-Paper

Advertisement

E-Paper

Apps

Book Your Copy

Visit Telangana Today

Thursday, June 17, 2021
Home తెలంగాణ విద్యుత్తు సంస్థలకు మినహాయింపు నిరంతర

విద్యుత్తు సంస్థలకు మినహాయింపు నిరంతర

విద్యుత్తు సంస్థలకు మినహాయింపు నిరంతర
  • విద్యుత్తు సరఫరాకు కృషి చేయాలి
  • ఉద్యోగులకు ట్రాన్స్‌కో, జెన్‌కో సీఎండీ పిలుపు

హైదరాబాద్‌, మే 11 (నమస్తే తెలంగాణ): రాష్ట్రవ్యాప్తంగా నిరంతరాయంగా విద్యుత్తును అందించేందుకు విద్యుత్తు సంస్థల ఉద్యోగులందరూ మరింత అప్రమత్తంగా ఉండాలని, అత్యవసర సేవల కింద విద్యుత్తు సంస్థలకు లాక్‌డౌన్‌ నుంచి మినహాయింపు ఇచ్చిందని ట్రాన్స్‌కో, జెన్‌కో సీఎండీ దేవులపల్లి ప్రభాకర్‌రావు ఒక ప్రకటనలో తెలిపారు. కరోనా నేపథ్యంలో దానిని సమర్థంగా ఎదుర్కొనేందుకు అంతరాయం లేకుండా విద్యుత్తు అందించాల్సిన బాధ్యత సంస్థ ఉద్యోగులపై ఉన్నదన్నారు. నిబంధనలను పాటి స్తూ.. ఉద్యోగులు బాధ్యతలను నిర్వర్తించాలని సూచించారు. రెగ్యులర్‌గా చేసే మెయింటనెన్స్‌ పనులన్నీ కొనసాగించాలన్నారు. ఉద్యోగులందరూ ఐడీ కార్డులను తెచ్చుకోవాలని, దీనివల్ల లాక్‌డౌన్‌ సమయంలో విధి నిర్వహణకు ఇబ్బందులు తలెత్తవని పేర్కొన్నారు. ఎమర్జెన్సీ విధులు నిర్వర్తించే ఉద్యోగులకు, వాహనాలకు, కాంట్రాక్టర్లకు తాత్కాలిక పాస్‌లను ఇంజినీర్లు జారీచేయాలని ఆదేశించారు.

Advertisement
-Advertisement-

తాజావార్తలు

Advertisement
విద్యుత్తు సంస్థలకు మినహాయింపు నిరంతర

ట్రెండింగ్‌

Advertisement