శనివారం 16 జనవరి 2021
Telangana - Jan 14, 2021 , 02:14:00

భాషావృద్ధికి కృషి చేయాలి

భాషావృద్ధికి కృషి చేయాలి

  • మంత్రి సింగిరెడ్డి నిరంజన్‌ రెడ్డి 

వనపర్తి, జనవరి13: భాషా, సాహిత్యాభివృద్ధికి కవులు, సాహితీవేత్తలు కృషిచేయాలని వ్యవసాయశాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి కోరారు. బుధవారం వనపర్తి జిల్లాకేంద్రంలో సురవరం ప్రతాపరెడ్డి కమిటీ సభ్యులు ఏర్పాటుచేసిన భాషా, కవి పండితులు రచించిన కవితా సంపుటాల ఆవిష్కరణ కార్యక్రమంలో మంత్రి పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. సాహిత్యంలో సరళ కవిత్వంతోపాటు పద్య కవిత్వం పెరగాలని ఆకాంక్షించారు. సంక్రాంతి అంటే కీడు పండుగని మన పెద్దవాళ్లు అనేవారని.. కానీ, తెలంగాణ ఏర్పడిన తరువాత కీడు పండుగ కాకుండా కీర్తి పండుగ అయ్యిందని చెప్పారు. ఎటు చూసినా ఆకుపచ్చని తెలంగాణ, పాడి పంటల తెలంగాణ, పాడి పశువుల తెలంగాణగా మారి గ్రామీణ పల్లెలు మొత్తం పచ్చదనంతో కళకళలాడుతున్నాయని వివరించారు.