సోమవారం 10 ఆగస్టు 2020
Telangana - Jul 20, 2020 , 02:35:59

అన్ని మున్సిపాలిటీల్లో టాయిలెట్స్‌ ఆన్‌ వీల్స్‌

అన్ని మున్సిపాలిటీల్లో టాయిలెట్స్‌ ఆన్‌ వీల్స్‌

  • రవాణాశాఖ మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్‌      

మామిళ్లగూడెం: ప్రతిమున్సిపాలిటీ, నగరపాలక సంస్థల పరిధిలో షీ మొబైల్‌ టా యిలెట్స్‌ను ఏర్పాటుచేస్తామని రవాణాశాఖ మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్‌ చెప్పా రు. ఆదివారం ఖమ్మం నగరంలో తొలిసారిగా షీ మొబైల్‌ బయో టాయిలెట్స్‌ను మం త్రి ప్రారంభించారు. ఈ సందర్భంగా పువ్వాడ మాట్లాడుతూ.. బహిరంగ మలమూత్ర విసర్జన రహిత(ఓడీఎఫ్‌) పట్టణాల సాధనలో భాగంగా ఇప్పటికే ప్రభుత్వం భారీసంఖ్యలో వ్యక్తిగత మరుగుదొడ్లను నిర్మించిందన్నారు. ఆగస్టు 15 నాటికి ప్రతి వెయ్యి మందికి ఒక పబ్లిక్‌ టాయిలెట్‌ నిర్మించాలని లక్ష్యంగా ముందుకెళ్తున్నామని చెప్పారు. అవసరమైన చోట టాయిలెట్‌ ఆన్‌వీల్స్‌ ఏర్పాటు చేయాలన్న మంత్రి కేటీఆర్‌ ఆదేశాల మేరకు వీటిని అందుబాటులోకి తెస్తున్నామన్నారు. వీటి నిర్వాహణను స్లమ్‌ లెవల్‌ ఫెడరేషన్స్‌ లేదా పట్టణ వికలాంగుల సమితి లేదా మహిళా సంఘాలు, ఔట్‌ సోర్సింగ్‌ ఏజెన్సీలకు అప్పగించాలని భావిస్తున్నట్లు తెలిపారు.  


logo