శనివారం 26 సెప్టెంబర్ 2020
Telangana - Sep 15, 2020 , 18:54:28

రాష్ర్టంలో కొత్త పోలీస్‌ స్టేష‌న్ల ఏర్పాటుకు చ‌ర్య‌లు : మ‌హ‌మూద్ అలీ

రాష్ర్టంలో కొత్త పోలీస్‌ స్టేష‌న్ల ఏర్పాటుకు చ‌ర్య‌లు : మ‌హ‌మూద్ అలీ

హైద‌రాబాద్ : రాష్ర్టంలోని పోలీస్ క‌మిష‌న‌రేట్ల ప‌రిధిలో నూత‌న పోలీస్ స్టేష‌న్ల ఏర్పాటుకు ప్ర‌య‌త్నాలు ప్రారంభించిన‌ట్లు రాష్ర్ట హోంమంత్రి మ‌హ‌మూద్ అలీ మంగ‌ళ‌వారం తెలిపారు. శాస‌న మండ‌లి ప్ర‌శ్నోత్త‌రాల స‌మ‌యంలో ఎమ్మెల్సీ శేరి సుభాష్‌రెడ్డి, ఇత‌ర స‌భ్యులు అడిగిన ప్ర‌శ్నల‌కు మంత్రి స‌మాధాన‌మిచ్చారు. నూత‌న పోలీస్ స్టేష‌న్ల ఏర్పాటు ప్ర‌క్రియ‌ ఇప్ప‌టికే ప్రారంభ‌మైన‌ట్లు ఆ విష‌యాన్ని డీజీపీ ఎం. మ‌హేంద‌ర్‌రెడ్డి ప‌ర్య‌వేక్షిస్తున్న‌ట్లు చెప్పారు. కొత్త‌గా ఏర్ప‌డ్డ 11 జిల్లాల్లో ట్రాఫిక్ పోలీస్ స్టేష‌న్లు లేవ‌న్నారు. వీటిలో జ‌య‌శంక‌ర్ భూపాల‌ప‌ల్లి, కొమురంభీం ఆసిఫాబాద్‌, నారాయ‌ణ‌పేట్‌, కామారెడ్డి, జోగులాంబ గ‌ద్వాలా, ములుగు జిల్లాలు ఉన్నాయ‌న్నారు. లా అండ్ ఆర్డ‌ర్ పోలీసుల‌నే ట్రాఫిక్ ప‌నుల‌కు వినియోగిస్తున్న‌ట్లు చెప్పారు.  రానున్న రోజుల్లో ఇందుకు అవ‌స‌ర‌మైన చ‌ర్య‌లు తీసుకుంటామ‌న్నారు. బాగా ర‌ద్దీ ఉన్న జంక్ష‌న్ల‌లో అద‌న‌పు సిబ్బందిని నియ‌మిస్తున్న‌ట్లు వెల్ల‌డించారు. 


logo