మంగళవారం 19 జనవరి 2021
Telangana - Dec 22, 2020 , 15:48:31

ఇంద‌ల్వాయి ఆల‌య‌ అభివృద్ధికి కృషి : మ‌ంత్రి ఇంద్ర‌క‌ర‌ణ్‌రెడ్డి

ఇంద‌ల్వాయి ఆల‌య‌ అభివృద్ధికి కృషి : మ‌ంత్రి ఇంద్ర‌క‌ర‌ణ్‌రెడ్డి

నిజామాబాద్ : జిల్లా ‌ప‌రిధిలోని ఇందల్వాయి మండలం దేవితండా సేవాలాల్ ఆలయ 8వ‌ వార్షికోత్సవం, రాజగోపురం ప్రతిష్టాపన‌ మహోత్సవం మంగ‌ళ‌వారం అత్యంత వైభ‌వోపేతంగా జ‌రిగింది. ఈ‌ మహోత్సవంలో మంత్రులు ఇంద్రకరణ్ రెడ్డి, సత్యవతి రాథోడ్, వేముల ప్రశాంత్ రెడ్డి, ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్దన్, ఎమ్మెల్సీలు కల్వకుంట్ల కవిత, వీజీ గౌడ్, నిజామాబాద్ జడ్పీ ఛైర్మన్ దాదన్నగరి విట్టల్ రావ్, నిజామాబాద్ మేయర్ దండు నీతు కిరణ్ , జెడ్పీటీసీ, ఎంపీటీసీలు పాల్గొన్నారు. 

ఈ సంద‌ర్భంగా మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి మాట్లాడుతూ.. ఇందల్వాయి దేవాలయ అభివృద్ధి కోసం పూర్తి సహకారం అందిస్తామ‌న్నారు. ఇంజనీర్లను పంపించి అంచనా వేయించి అవర‌మైన‌ నిధులను అంద‌జేస్తాయ‌నున్న‌ట్లు తెలిపారు. ఇంకా ఎక్కువ నిధులు కావాలంటే మంత్రి ప్రశాంత్ రెడ్డి, ఎమ్మెల్సీ కవిత.. సీఎం దగ్గరకు వెళ్లి కృషి చేయాల‌న్నారు. దూప దీప నైవేద్యములను రూ. 2 వేల నుంచి రూ. 6 వేల‌కు పెంచిన విష‌యాన్ని ఈ సంద‌ర్భంగా గుర్తుచేశారు. రాష్ట్రంలో 20 వేల మంది పూజారులకు ఇస్తున్న‌ట్లు తెలిపారు.