ఆదివారం 24 జనవరి 2021
Telangana - Dec 26, 2020 , 19:20:43

‘మహబూబాబాద్‌ జిల్లా సమగ్రాభివృద్ధికి కృషి’

‘మహబూబాబాద్‌ జిల్లా సమగ్రాభివృద్ధికి కృషి’

మహబూబాబాద్ : జిల్లా సమగ్రాభివృద్ధికి శక్తివంచన లేకుండా కృషిచేస్తానని రాష్ట్ర గిరిజన, స్త్రీశిశు సంక్షేమ శాఖల మంత్రి సత్యవతి రాథోడ్ అన్నారు. శనివారం జిల్లా కేంద్రంలో ఆటోమెటెడ్ సిగ్నల్ వ్యవస్థను జడ్పీ చైర్‌పర్సన్ ఆంగోతు బిందు, ఎమ్మెల్యే శంకర్ నాయక్ కలిసి ఆమె ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. త్వరలో పట్టణంలోని జంక్షన్లన్నీంటిలో ఆటోమెటెడ్‌ సిగ్నల్ వ్యవస్థను ఏర్పాటు చేస్తామన్నారు. జిల్లా కేంద్రంలో అన్ని వసతులు కల్పిస్తామని హామీ ఇచ్చారు. కొత్త జిల్లాల ప్రతిఫలాలు ఇప్పుడిప్పుడే ప్రజలకు అందుతున్నాయని పేర్కొన్నారు.

మహబూబాబాద్ మున్సిపాలిటీ అభివృద్ధికి పురపాలకశాఖ మంత్రి కేటీఆర్ రూ.50 కోట్ల నిధులిచ్చారని గుర్తుచేశారు. వాహనదారులు ట్రాఫిక్  నిబంధనలు పాటించి ప్రమాదాల నియంత్రణకు సహకరించాలన్నారు. ఆటోమెటెడ్‌ సిగ్నల్స్‌పై వాహనదారుల్లో అవగాహన కల్పించాలని పోలీసులకు సూచించారు. కార్యక్రమంలో  కలెక్టర్ వీపీగౌతమ్, ఎస్పీ నంద్యాల కోటిరెడ్డి, మున్సిపల్ చైర్మన్ రామ్మోహన్ రెడ్డి, పలువురు అధికారులు, నాయకులు పాల్గొన్నారు. 

లోకల్ టు గ్లోబల్.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్లో నమస్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.


logo