శుక్రవారం 27 నవంబర్ 2020
Telangana - Nov 13, 2020 , 16:58:57

గిరిజనుల సంక్షేమానికి ప్రభుత్వం కృషి

గిరిజనుల సంక్షేమానికి ప్రభుత్వం కృషి

ఆదిలాబాద్‌ : గిరిజనుల సంక్షేమం, అభివృద్ధి కోసం ప్రభుత్వం అనేక సంక్షేమ కార్యక్రమాలు అమలు చేస్తుందని జిల్లా కలెక్టర్ సిక్తా పట్నాయక్ అన్నారు. శుక్రవారం నార్నూర్ మండలం జామాడా గ్రామంలో దండారీ కార్యక్రమంలో కలెక్టర్, ఎస్పీ, ఐటీడీఏ పీవో అధికారులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ..దీపావళి పండుగ సందర్భంగా నిర్వహించే దండారీ ఉత్సవంలో మొదటిసారి పాల్గొనడం అదృష్టమని, పండుగ శుభాకాంక్షలు తెలిపారు.

ఎస్పీ విష్ణు ఎస్.వారియర్ మాట్లాడుతూ..పోలీస్ శాఖ ద్వారా గిరిజనులకు విద్య, వైద్యం సౌకర్యాలు అందిస్తున్నామని, యువతకు వివిధ రకాల పోటీ పరీక్షలకు కోచింగ్ ఇస్తున్నామని తెలిపారు. దేశ భవిష్యత్తు యువత చేతిలో ఉందని తెలిపారు. ప్రతి ఒక్కరు చదువుకొని ఉపాధి అవకాశాలు పొందాలన్నారు. పి.ఓ.భావేశ్ మిశ్రా  అంతకుముందు గిరిజనులు సంప్రదాయం ప్రకారం స్వాగతం పలికారు. పూజ కార్యక్రమాలు నిర్వహించారు. దింమ్సా నృత్యంలో కలెక్టర్ పాల్గొన్నారు. కార్యక్రమంలో ఐటీడీవో పీవో భవేష్‌ మిశ్రా, ఉట్నూర్ డీఎస్పీ ఎన్. ఉదయ్ రెడ్డి, నార్నూర్ సీఐ. రమణమూర్తి తదితరులు పాల్గొన్నారు.