బుధవారం 27 మే 2020
Telangana - May 06, 2020 , 16:01:29

టెన్త్‌ పరీక్షలపై విద్యాశాఖ కార్యదర్శి సమీక్ష

టెన్త్‌ పరీక్షలపై విద్యాశాఖ కార్యదర్శి సమీక్ష

హైదరాబాద్‌ : కరోనా వైరస్‌ నేపథ్యంలో పదో తరగతి పరీక్షలు, ఇంటర్‌ జవాబు పత్రాల మూల్యాంకనంపై డీఈవోలు, డీఐఈవోలతో విద్యాశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి  చిత్రారామచంద్రన్‌ వీడియో కాన్పరెన్స్‌ ద్వారా సమీక్షించారు. కరోనా వైరస్‌ మూలంగా పదో తరగతి పరీక్షలను ప్రభుత్వం వాయిదా వేసిన విషయం తెలిసిందే. తాజాగా సీఎం కేసీఆర్‌ పదో పరీక్షలు నిర్వహిస్తామని తెలిపిన నేపథ్యంలో పరీక్షల నిర్వహణ, ఇంటర్‌  పరీక్షల మూల్యాంకనంపై సమీక్షిస్తున్నారు.  ఇంటర్‌ బోర్డు కార్యదర్శి ఉమర్‌ జలీల్‌, పరీక్షల విభాగం సంచాలకుడు సత్యనారాయణరెడ్డితో చిత్రారామచంద్రన్‌ సమీక్షించారు.logo