శుక్రవారం 03 జూలై 2020
Telangana - Feb 04, 2020 , 01:30:46

ఉత్తమ ఫలితాలు సాధించాలి

ఉత్తమ ఫలితాలు సాధించాలి
  • గురుకుల పాఠశాలల ప్రిన్సిపాళ్ల సదస్సులో విద్యాశాఖ కార్యదర్శి జనార్దన్‌రెడ్డి

కేపీహెచ్‌బీ కాలనీ: రాష్ట్రంలోని గురుకుల పాఠశాలల ప్రిన్సిపాళ్లు ఉత్తమ నాయకులుగా పనిచేయాలని, వందశాతం ఫలితాలను సాధించేలా కృషిచేయాలని విద్యాశాఖ కార్యదర్శి జనార్దన్‌రెడ్డి పిలుపునిచ్చారు. సోమవారం జేఎన్టీయూహెచ్‌లోని జేఎన్‌ ఆడిటోరియం లో రెసిడెన్సియల్‌ స్కూల్‌ లీడర్స్‌ కన్వెన్షన్‌- ట్రాన్సెండ్‌ 2020 పేరున నిర్వహించిన సదస్సులో ఆయన మాట్లాడుతూ.. విద్యార్థులకు చదువుతోపాటు నైతిక విలువలు నేర్పాలని సూచించారు. కార్యక్రమంలో సోషల్‌, ట్రైబల్‌ రెసిడెన్షియల్‌ వెల్ఫేర్‌ సొసైటీ సెక్రటరీ ఆర్‌ఎస్‌ ప్రవీణ్‌కుమార్‌, బీసీ రెసిడెన్షియల్‌ వెల్ఫేర్‌ సొసైటీ సెక్రటరీ మల్లయ్య భట్టు, మైనార్టీ రెసిడెన్షియల్‌ వెల్ఫేర్‌ సొసైటీ సెక్రటరీ షఫీఉల్లా, జనరల్‌ రెసిడెన్షియల్‌ వెల్ఫేర్‌ సొసైటీ సెక్రటరీ ప్రసాద్‌ పాల్గొన్నారు. 


logo