శనివారం 06 మార్చి 2021
Telangana - Jan 17, 2021 , 01:12:53

బడులు బాగు చేసుకోండి

బడులు బాగు చేసుకోండి

 • 15 అంశాలతో ప్రధానోపాధ్యాయులకు చెక్‌లిస్ట్‌ 
 • 18లోగా డీఈవోలకు పంపాలన్న విద్యాశాఖ

హైదరాబాద్‌, జనవరి 16 (నమస్తే తెలంగాణ): విద్యాసంస్థల పునఃప్రారంభానికి పాఠశాల విద్యాశాఖ ఏర్పాట్లు చేస్తున్నది. పాఠశాలలు ప్రారంభించిన తర్వాత ఎలాంటి సమస్యలూ తలెత్తకుండా ఉండేందుకు అధికారులను అప్రమత్తం చేస్తున్నది. ఇందులో భాగంగా 15 అంశాలతో కూడిన చెక్‌లిస్ట్‌ను ప్రధానోపాధ్యాయులకు పంపించింది. వాటిని పూర్తి చేసి ఈ నెల 18లోగా డీఈవోలకు అందించాలని ఆదేశించింది.  

 • 9, 10వ తరగతుల విద్యార్థులు, వారి తల్లిదండ్రుల జాబితాను సిద్ధం చేయటం. ఆరోగ్య పరిస్థితి ఆరా తీయడం.
 • మధ్యాహ్న భోజన ఏజెన్సీని సంప్రదించి ఫిబ్రవరి 1 నుంచి భోజనం అందించేలా చర్యలు తీసుకోవడం, పాత ఏజెన్సీ సుముఖంగా లేకపోతే కొత్త ఏజెన్సీని ఎంపిక చేయడం.
 • గ్రామ పంచాయతీ, మున్సిపాలిటీలను సంప్రదించి పాఠశాల ప్రాంగణాన్ని శుభ్రం చేసేలా చూడటం.
 • తమ పిల్లలను ఇష్టపూర్వకంగా స్కూళ్లకు పంపిస్తున్నట్టు సమ్మతి తెలిపే లేఖలను తీసుకోవడం.
 • కొవిడ్‌ -19 మార్గదర్శకాలను పాటించడం.
 • మోడల్‌ స్కూళ్లు, కేజీబీవీలకు వంటసామగ్రి, కూరగాయలు సరఫరా అయ్యేలా చర్యలు తీసుకోవడం.
 • ప్రధానోపాధ్యాయుడి, స్టాఫ్‌రూం, తరగతిగదులు, వంటగదిని శుభ్రంచేయించడం.
 • తాగు నీటి వసతి (నల్లానీళ్లు, బోరువాటర్‌ను పరిశీలించడం), మురుగునీటి వ్యవస్థ సరి చూసుకోవడం.
 • విద్యుత్‌కనెక్షన్లు సవ్యంగా ఉన్నాయో లేదో చూడటం.
 • టాయ్‌లెట్లను శుభ్రంచేయించడం.
 • ఫర్నిచర్‌, బెంచీలు, కుర్చీలు, వంట సామగ్రి, వంట పాత్రలు శుభ్రంగా ఉంచడం.
 • మధ్యాహ్న భోజనానికి కావాల్సిన బియ్యం సరఫరా కోసం లేఖ రాయడం.

VIDEOS

logo