శనివారం 28 నవంబర్ 2020
Telangana - Nov 04, 2020 , 01:59:56

విద్యతోపాటు ఉపాధి నైపుణ్య శిక్షణ

విద్యతోపాటు ఉపాధి నైపుణ్య శిక్షణ

  • గురుకుల విద్యాలయాల సంస్థ కార్యదర్శి ప్రవీణ్‌కుమార్‌

మొయినాబాద్‌: గురుకుల విద్యాసంస్థల్లో విద్యార్థులకు నాణ్యమైన విద్యతోపాటు ఉపాధి, నైపుణ్య శిక్షణ ఇస్తున్నామని గురుకుల విద్యాల యాల సంస్థ కార్యదర్శి డాక్టర్‌ ఆర్‌ఎస్‌ ప్రవీణ్‌కుమార్‌ తెలిపారు. రంగారెడ్డి జిల్లా మొయినాబాద్‌ మండలం తోలుకట్ట సమీపంలోని తెలంగాణ సాంఘిక సంక్షేమ గురుకుల మహిళా డిగ్రీ కళాశాలలో ఫిట్‌నెస్‌ శిక్షణ శిబిరం, వ్యాయామశాలను మంగళవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. విద్యార్థులకు విద్యతోపాటు శారీరక, మానసిక దృఢత్వా న్ని పెంపొందించేందుకు  ఫిట్‌నెస్‌ శిక్షణ కేంద్రాలను ఏర్పాటు చేస్తున్నామని వివరించారు. నిష్ణాతులతో శిక్షణ ఇప్పిస్తున్నామనీ, విద్యార్థులు భవిషత్తులో ఉద్యోగం కోసం ఎదురు చూడకుండ ఫిట్‌నెస్‌ కేంద్రాలను ఏర్పాటు చేసుకుని ఉపాధి పొందవచ్చన్నారు.