బుధవారం 20 జనవరి 2021
Telangana - Nov 26, 2020 , 18:42:46

విద్యావంతులు ఆలోచించి ఓటువేయాలి : మంత్రి కొప్పుల

విద్యావంతులు ఆలోచించి ఓటువేయాలి : మంత్రి కొప్పుల

హైదరాబాద్‌ : జీహెచ్‌ఎంపీ ఎన్నికల్లో విద్యావంతులంతా ఆలోచించి ఓటువేయాలని సంక్షేమ శాఖల మంత్రి కొప్పుల ఈశ్వర్‌ కోరారు. గురువారం అల్వాల్‌లో తెలంగాణ ప్రైవేటు పాఠశాలల యాజమాన్య సంఘాలతో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడారు. బీజేపీ ప్రభుత్వ పాలనలో దేశంలో జరిగిన అభివృద్ధి, నెలకొన్న పరిస్థితులపై నిశితంగా ఆలోచించాలని కోరారు.  కేంద్రంలోని బీజేపీ సర్కార్‌ దేశాన్ని అభివృద్ధి చేయకుండా, ప్రజల జీవన ప్రమాణాలను పెంచకుండా వైఫల్యాలను కప్పి పుచ్చుకునేందుకు ప్రజల మధ్య విద్వేషాలను రెచ్చగొడుతోంది. 

మతం, దేశభక్తి పేరుతో బీజేపీ నాయకులు రాజకీయాలు చేస్తున్నారు. తెలంగాణ ప్రజలంతా దేశంతోపాటు తోటివారిని గౌరవించే నిజమైన దేశభక్తులు.కాషాయం పార్టీ నాయకులకు ఎన్నికలొచ్చినప్పుడే దేశభక్తి, దేవుడు గుర్తుకొస్తారు. యువతలో భావోద్వేగాలు పెంచి పబ్బం గడుపుకునే ప్రయత్నాలు బీజేపీ మానుకోవాలి. ఇలాంటి విపరీత ధోరణులు అర్థం చేసుకుని ప్రజల్లో చైతన్యం తేవాల్సిన బాధ్యత ఉపాధ్యాయులపై ఉంది’ అని మంత్రి కొప్పుల పేర్కొన్నారు. జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో టీఆర్‌ఎస్‌ అభ్యర్థులకు మద్దతుగా నిలవాలని ఆయన కోరారు. 

లోక‌ల్ టు గ్లోబ‌ల్‌.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్‌లో. న‌మ‌స్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


logo