‘ఫ్యూచర్'పై ఈడీ దర్యాప్తు వేగం

హైదరాబాద్, జనవరి 23 (నమస్తే తెలంగాణ): దేశవ్యాప్తంగా గొలుసుకట్టు మార్కెటింగ్‌తో లక్షల మందిని మోసగించిన ప్యూచర్ మార్కర్ లైఫ్‌కేర్ ప్రైవేటు లిమిటెడ్ డైరెక్టర్లు రాధేశ్యామ్, బన్సీలాల్‌పై దర్యాప్తు ప్రారంభించేందుకు అనుమతి కోరుతూ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) అధికారులు హర్యానాలోని పంచకుల కోర్టులో దరఖాస్తు చేశారు. హర్యానాలోని హిస్సార్‌లో కంపెనీని స్థాపించిన నిర్వాహకులు దానిద్వారా దేశవ్యాప్తంగా ఏజెంట్లను నియమించుకుని మనీలాండరింగ్ చేసినట్టు అధికారులు ఇప్పటికే గుర్తించారు. కంపెనీ మోసాలపై హర్యానాతోపాటు తెలంగాణలోని పలు పోలీస్స్టేషన్లలోనూ కేసులు నమోదయ్యాయి. దాదాపు 31 లక్షల మంది వినియోగదారులను ఈ కంపెనీ మోసగించినట్టు దర్యాప్తులో తేలింది. చండీగఢ్, ఢిల్లీలోని పలు ప్రాంతాల్లో కంపెనీ పేరిట ఉన్న వ్యవసాయ భూములు, బ్యాంకు ఖాతాల్లోని రూ.261.35 కోట్లను ఈడీ అధికారులు జప్తుచేశారు.
తాజావార్తలు
- అమానుషం.. ముళ్లపొదల్లో అప్పుడే పుట్టిన ఆడశిశువు
- ఇంధన ధరలపై దద్దరిల్లిన రాజ్యసభ.. ఒంటి గంట వరకు వాయిదా
- పవర్ ఫుల్ ఉమెన్స్‌తో వకీల్ సాబ్.. పోస్టర్ వైరల్
- భారత్‌కు ఎగువన బ్రహ్మపుత్రపై డ్యామ్స్.. చైనా గ్రీన్‌సిగ్నల్
- మెదక్ జిల్లాలో మహిళపై యాసిడ్ దాడి
- మెన్స్ డేను కూడా సెలబ్రేట్ చేయాలి : ఎంపీ సోనాల్
- ఉమెన్స్ డే స్పెషల్: విరాట పర్వం నుండి అమెజింగ్ వీడియో
- మునగాలలో అదుపుతప్పి బోల్తాపడ్డ కారు.. మహిళ మృతి
- రాజ్యసభలో కాంగ్రెస్ ఎంపీల ఆందోళన
- అంతర్జాతీయ మహిళా దినోత్సవం శుభాకాంక్షలు: మహేష్